సాధారణంగా ఒక సినిమా చేయాలి అంటే దర్శక నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్లు( Music directors ) ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఈ విధంగా తమ సినిమాలోని పాటలు కాని సంగీతం కానీ డైలాగ్స్ కానీ ఇతర సినిమాలకు పోలిక లేకుండా తీస్తేనే ఆ సినిమా ఏ విధమైనటువంటి ట్రోల్స్ ఎదురుకోదు.
అలా కాకుండా ఆ సినిమాలోని సన్నివేశాలు కనుక ఇతర సినిమాలను పోలివున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇతర సినిమాలను పోలివున్న వెంటనే కాఫీ అంటూ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తారు.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎస్ ఎస్ తమన్ ( SSThaman ) తరచూ కాపీ ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.ఇందులో భాగంగా మణిశర్మ ( Mani Sharma ) టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరికీ సంగీతం అందించారు.అయితే ఈయన అందించినటువంటి ఈ మ్యూజిక్ మొత్తం కాపీనే అంటూ ఒక వీడియో సంచలనంగా మారింది.ఇలా మణిశర్మ సంగీతంలో వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా దాదాపు ఇతర భాషలలో కాపీ ట్యూన్ అంటూ నేటిజన్స్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

ఇక ఈ కాపీ ట్యూన్స్ పై యధావిధిగా మీమర్స్ భారీ స్థాయిలో మీమ్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తున్నారు.తమన్ మాత్రమే కాదు మణిశర్మ కూడా కాపీ క్యాట్ అంటూ మణిశర్మ అను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అయితే మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాల సమయంలో సోషల్ మీడియా పెద్దగా అభివృద్ధి చెందలేదు కనుక వేరే ట్యూన్స్ కాపీ కొట్టిన పెద్దగా తెలిసేది కాదు కానీ సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఇలాంటి కాపీ ట్యూన్స్ కనుక వస్తే వెంటనే దొరికిపోతు భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.ఇప్పటివరకు తమన్ మాత్రమే ఈ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు కానీ ఇప్పుడు మాత్రం మణిశర్మ కూడా తమన్ కి తోడుగా ఈ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి.







