మరణించిన అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించిన నటుడు సూర్య!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు సూర్య ( Suriya ) ఒకరు.ఈయన ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Suriya Visited A Fan House And Offered Condolences To His Family , Suriya, Fan,-TeluguStop.com

కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు.ఇక సూర్యకు తెలుగులో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సూర్య పుట్టినరోజు వేడుకలు కనుక వస్తే తెలుగు రాష్ట్రాలలో కూడా అభిమానులు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

తనని అభిమానించే అభిమానులకు ఏదైనా జరిగితే ఆయన వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు.గత కొద్ది రోజుల క్రితం సూర్య పుట్టినరోజు ( Birthday ) వేడుకలను నిర్వహించడం కోసం ఓ అభిమాని ఏర్పాట్లు చేస్తూ ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కి గురై మరణించారు.

Telugu Kanguva, Kollywood, Suriya, Suryas, Tollywood-Movie

ఇలా తన పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఒక అభిమాని మరణించారన్న వార్త తెలియగానే సూర్య ఎంతో కృంగిపోయారు.వెంటనే ఈయన ఆ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి వారందరిని పరామర్శించడమే కాకుండా వారి కుటుంబానికి అండగా నిలిచారు.ఏ సమస్య వచ్చినా వెంటనే తనకు తెలియజేయాలని ఆ కుటుంబానికి తాను అండగా ఉంటాను అంటూ సూర్య ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.అయితే తాజాగా మరొక అభిమాని రోడ్డు ప్రమాదంలో మరణించారనే విషయం సూర్యకు తెలియడంతో వెంటనే ఈయన ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

Telugu Kanguva, Kollywood, Suriya, Suryas, Tollywood-Movie

ఇలా అభిమాని ఇంటికి చేరుకున్నటువంటి సూర్య అభిమాని ఫోటోకి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.ఇలా సూర్య స్వయంగా అభిమాని ఇంటికి వెళ్లి వారికి ధైర్యం చెబుతూ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సూర్య అభిమానుల పట్ల చూపించే ప్రేమాభిమానాలకు ఫిదా అవుతు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక సూర్య సినిమాలో విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం కంగువా( Kanguva ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube