వినియోగదారులారా, గమనించండి! కేంద్రం 138 బెట్టింగ్, 94 లోన్ యాప్స్‌ని బ్యాన్ చేసింది!

అవును, మీరు విన్నది నిజమే.కేంద్రం ఎప్పటి మాదిరిగా చైనాతో లింకులున్న దాదాపు 200 యాప్స్‌ను నిషేధించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇందులో 138 యాప్స్ బెట్టింగ్‌కు సంబంధించినవి కాగా 94 యాప్స్ లోన్ లెడింగ్ విభాగానికి చెందినవిగా తెలుస్తోంది.ఈ యాప్స్ అన్నీ కూడా చైనాతో సంబంధం కలిగి ఉన్నందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ యాప్స్‌ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.హోమ్ మంత్రిత్వ శాఖ నుంచి యాప్స్ నిషేధానికి సంబంధించి ఆదేశాలు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అందినట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ మేరకు ఈ మంత్రిత్వ శాఖ ఇప్పటికే యాప్స్ బ్లాక్‌ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 250కి పైగా చైనీస్ యాప్స్‌ను నిషేధించింది.భారత సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత వంటి వాటికి విఘాతం కలుగుతుందనే కారణంగా కేంద్రం చైనా యాప్స్‌ను నిషేధిస్తూ వస్తోందని విషయం విదితమే.

Advertisement

ఇకపోతే కేంద్రం నిషేధించిన యాప్స్‌లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి టిక్ టాక్, క్సేండర్, పబ్‌జీ, క్యామ్‌స్కానర్, గరీన ఫ్రీ ఫైర్ వంటి ప్రముఖ యాప్స్‌ కూడా ఉన్నాయి.

ఇవన్నీ యూజర్ల నుంచి కీలకమైన డేటాను సేకరిస్తున్నందునే కేంద్ర ప్రభుత్వం వీటిని బ్యాన్ చేసింది.అలాగే ఈ యాప్స్ యూజర్ల నుంచి స్మార్ట్ ఫోన్‌లో కీలకమైన పర్మిషన్లు కోరుతున్నట్లు కేంద్రానికి పెద్ద ఎత్తున పిర్యాదులు అందడంతో ఇలాంటి నిర్ణయాలు ఇకనుండి తప్పవని కేంద్రం తాజాగా ప్రకటించడం విశేషం.ఎందుకంటే లెండింగ్ యాప్స్ ద్వారా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూసాం.

ఇక లోన్ లెండింగ్ యాప్స్ నిర్వహకుల వేధింపులు తట్టుకోలేక దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూసాం.ఈ నేపథ్యంలోనే దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా గతంలో లోన్ లెండింగ్ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరింది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు