దేశ‌భ‌క్తిని పురిగొల్పుతున్న రాజ్యాంగ పార్కు... ఎక్క‌డున్న‌దంటే...

రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో గ‌ల‌ రాజ్‌భవన్‌లో కొత్తగా నిర్మించిన రాజ్యాంగ పార్కును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.రాజ్ భవన్ ప్రతినిధి తెలిపిన వివ‌రాల ప్రకారం ఈ పార్క్‌లో శిల్పాలు, పెయింటింగ్‌ల ద్వారా రాజ్యాంగ రూపకల్పన మొద‌లుకొని దాని అమలు చేసినంత వ‌ర‌కూ జ‌రిగిన‌ ప్రయాణానికి దృశ్య‌రూపం క‌ల్పించారు.

 Constitution Park That Promotes Patriotism, Constitution Park,jaipur , Rajasthan-TeluguStop.com

ఈ పార్కును జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ 9 కోట్ల రూపాయల వ్య‌యంతో నిర్మించింది.కొత్త తరానికి దేశ రాజ్యాంగ ప్రాముఖ్యతను, చరిత్రను తెలియజేయడమే ఈ పార్కు నిర్మాణం వెనుకనున్న‌ ఉద్దేశమని ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.అలాగే దేశ స్వాతంత్య్రానికి మూల‌కారకులైన మహనీయుల గురించి రాబోయే తరాలకు తెలియ‌జెప్ప‌డ‌మే దీని ఉద్దేశం.

దేశంలోని తొలి రాజ్యాంగ ఉద్యానవనం

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని రాజ్‌భవన్‌లో నిర్మించిన రాజ్యాంగ ఉద్యానవనం దేశంలోని మొట్టమొదటిదిగా గుర్తింపు పొందింది.ఈ పార్కును త్వ‌ర‌లోనే సాధారణ ప్రజల సందర్శన కోసం తెరవనున్నారు.ముఖ్యంగా విద్యార్థులకు ఈ పార్కులో టూర్ క‌ల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ పార్క్ సంద‌ర్శ‌కులు రాజ్యాంగం కోసం జ‌రిగిన‌ ప్రయాణాన్ని మరియు దాని ప్రాముఖ్యతను సులభంగా అర్థం చేసుకోగ‌లుగుతారు.ఈ కాన్‌స్టిట్యూషన్ పార్క్ ప్రత్యేకత విష‌యానికి వ‌స్తే రాజ్ భవన్ ఆవరణలో జాతీయ జెండా చరిత్రను తెలిపే స్థూపాన్ని ఎంతో అందంగా తయారు చేశారు.

అలాగే రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన మ‌హ‌నీయుల‌ విగ్రహాలు కూడా ఉన్నాయి.ఈ విగ్రహాల స‌మీపంలో వీరి ఘ‌త‌న గురించి, దేశానికి వారు అందించిన సహకారం గురించిన వివ‌రాలు పొందుప‌రిచారు.

Telugu Park, Jaipur, Draupadi Murmu, Raj Bhavan, Rajasthan-Latest News - Telugu

మహారాణా ప్రతాప్ విగ్రహం ఏర్పాటు

ఈ ఉద్యానవనంలో మరొక ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే ఇక్కడ రాజస్థానీ గొప్ప‌ద‌నానికి మరియు వైభవానికి ప్రతీకగా నిలిచిన‌ మహారాణా ప్రతాప్ విగ్రహం తోపాటు అత‌ని ప్రియమైన గుర్రం చేతక్‌ను రూపొందించారు.ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.అలాగే జాతీయ పక్షి అయిన నెమలి యొక్క తెల్లని పాలరాతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అంతే కాకుండా రాజ్ భవన్ కాంప్లెక్స్‌లోని గార్డెన్‌లో రాతి పందిరి, నడక మార్గాలు, ఫౌంటైన్‌లు తదితరాలను అందంగా ఉండేలా ఏర్పాటు చేశారు.

రాజ్యాంగ ఉద్యానవనం సాధార‌ణ పౌరుల కోసం వారానికి 2 రోజులు తెరవనున్నారు.సంద‌ర్శ‌కుటు 50 స్లాట్లలో పార్కును సందర్శించగలుగుతారు.దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా ఈ రాజ్యాంగ పార్కు గురించి ప్రజలకు తెలియజేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube