జర్నలిస్టుల బస్ పాస్ ల జారీ విషయంలో ఆర్టీసీ, సమాచార శాఖ గతంలో కంటే భిన్నంగా వ్యవహరిస్తూ జర్నలిస్టుల హక్కులను కాల రాస్తున్నారనితెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టి.యు.
డబ్ల్యూ .జె -ఐ జే యు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు , నగర అధ్యక్షులు మైసా పాపారావు ,కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు,
జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, కార్యదర్శి కనకం సైదులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలో ఎన్నడు లేని విధంగా సమాచార శాఖ ఆర్టిసి బస్సు విషయంలో జోక్యం చేసుకుంటున్నారని, గతంలో ఉన్న విధానానికి భిన్నంగా ఈసారి సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేయడంశోచనీయమన్నారు .గతంలో జిల్లా కేంద్రంలో పనిచేసే విలేకరులతో పాటు డివిజన్ కేంద్రాలు, నియోజవర్గ కేంద్రాల్లో పనిచేసే విలేకరులకు స్టేట్ బస్ పాస్ జారీ చేశారని ఈసారి కొత్తగా జిల్లా కేంద్రం మరియు డివిజన్ కేంద్రాల్లో పని చేసే వారికి మాత్రమే స్టేట్ బస్సు పాసు జారీ చేస్తామని నియోజవర్గ కేంద్రాల్లో పని చేసే జర్నలిస్టులకు కేవలం జిల్లా బస్ పాస్ ల నూ మాత్రమే జారీ చేస్తామని ఆర్టీసీ సంస్థ పేర్కొనడం, దానికి సమాచారం శాఖ వంత పలుకుతూ రాత్రికి రాత్రి సర్కులర్ జారీ చేసి ఆ తర్వాత ఆ సర్కులర్ నూ పెండింగ్లో పెట్టి జర్నలిస్టులకు బస్సు పాసులు జారీ కాకుండా అడ్డుకున్నారని వారు ఆరోపించారు .
ఆర్టీసీ సంస్థ రోజురోజుకు రాయితీ బస్సు పాసులను తగ్గించేందుకు అంతర్గతంగా కుట్ర పన్నుతుందని అందులో భాగంగానే జర్నలిస్టుల బస్సు పాసుల విషయంలో కోత పెట్టారని వారు ఆరోపించారు.గతంలో ఉన్న మాదిరిగానే జిల్లా కేంద్రంలో పనిచేసే జర్నలిస్టులతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో పని చేసే జర్నలిస్టుల కూడా ఆర్టీసీ సంస్థ స్టేట్ బస్ పాసులను జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
లేని పక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు .