జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Jayashankar Bhupalpally )లోని స్వగ్రామం ధన్వాడకు మంత్రి శ్రీధర్ బాబు చేరుకున్నారు.ఉగాది పండుగ( Ugadi Festival ) సందర్భంగా దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీధర్ బాబు పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధికి రాజీ లేకుండా పని చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) తెలిపారు.
నిరుపేదలకు ఎల్లవేళలా కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.తమది ప్రజా ప్రభుత్వమన్న మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.