అగ్రరాజ్యం అమెరికా( America )లో మరో హైదరాబాద్ విద్యార్థి చనిపోయాడు.మూడు వారాల క్రితం కనిపించకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి అబ్దుల్ మహ్మద్ అరాఫత్( Hyderabad Student Abdul Mohammed Arafath ) మరణించాడు.
అరాఫత్ మృతిని న్యూయార్క్ లోని భారత ఎంబసీ ధృవీకరించింది.అయితే ముందుగా అరాఫత్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
అక్కడి బంధువులతో వెతికించినా ఆచూకీ లభించలేదు.దీంతో అమెరికాలతోని బంధువుల ద్వారా క్వీవ్ లాండ్( Cleveland ) పోలీసులకు ఫిర్యాదు చేయించారు.
ఈ క్రమంలోనే అరాఫత్ కనిపించకుండా పోయిన పది రోజుల తరువాత ఆయన తండ్రికి ఫోన్ కాల్ వచ్చిందని తెలుస్తోంది.అరాఫత్ ను కిడ్నాప్ చేశామన్న దుండగులు అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అరాఫత్ ఆచూకీ కోసం అమెరికా పోలీసులు( America Police ) తీవ్రంగా గాలించారు.చివరకు అరాఫత్ విగతజీవిగా కనిపించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.