కర్నాటక ఎన్నికలకు( Karnataka elections ) ఎంతో సమయం లేదు.మరికొద్ది రోజుల్లోనే అనగా వచ్చే నెల 10నే ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు పందెం కోళ్ళలా పోటీకి సై అంటున్నాయి.గెలుపు నీదా నాదా అంటూ జబ్బలు చరుస్తున్నాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జెడిఎస్ పార్టీల మద్యే ప్రధాన పోరు అయినప్పటికి ఏ పార్టీకి విజయం దక్కుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ.అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కన్నడనాట కమలం పోయి హస్తం వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్( Congress ) కూడా తమదే అధికారం అన్నంత ధీమాగా ఉంది.అయితే బీజేపీని కూడా ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి లేదు.

224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో స్వతంత్రంగా అధికారం చేపట్టాలంటే 113 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.అయితే ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ అందుకునే అవకాశం లేదనేది కొన్ని సర్వేలు చెబుతున్నా మాట.ఇదిలా ఉంచితే కాంగ్రెస్ కొంతమేర మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నా మాట.ఈ నేపథ్యంలో ఇటీవల కర్నాటకలో పర్యటించిన రాహుల్ గాంధీ( Rahul Gandhi ) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.కర్నాటకలో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని, అయితే 150కి పైగా సీట్లు గెలిస్తేనే అధికారం నిలబడుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.లేదంటే అధికారాన్ని బీజేపీ దొంగిలించే అవకాశం ఉందని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

దీంతో కన్నడ కొత్త చర్చలు మొదలయ్యాయి.ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారల్లో దూసుకుపోతున్నాయి కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు, కానీ బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలోనే ఉంది.దీంతో బీజేపీ ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తోంది అనే ప్రశ్న అందరిలోనూ కలుగకమానదు.

అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన దాన్ని కూల్చి అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీకి కొత్తేమీ కాదు.అందుకు ఉదాహరణ మహారాష్ట్రలో థాక్రే కు జరిగిన పరిణామాలే.ఒకవేళ కర్నాటకలో బీజేపీ ఓడిపోతే అదే వ్యూహాన్ని కమలనాథులు అప్లై చేసిన ఆశ్చర్యం లేదు.
అందుకేనేమో బీజేపీ పెద్దగా దూకుడు ప్రదర్శించడం లేదనేది కొందరి మాట.రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలూ కూడా బీజేపీ వ్యూహానికి అద్దం పడుతున్నాయి.మరి బీజేపీ పోటు నుంచి తప్పించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టారు రాహుల్ గాంధీ.మరి కాంగ్రెస్ టార్గెట్ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.







