కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు పోలీసులు నోటీసులు అందజేశారు.ఈనెల 30న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి నోటీస్ కాపీని అందుకున్నారు.ఇప్పటికే సునీల్ కనుగోలు టీమ్ సభ్యులు ముగ్గురికి పోలీసులు నోటీసులు అందించిన విషయం తెలిసిందే.సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలతో పాటు మంత్రి కేటీఆర్ లను కించపరుస్తూ పోస్టులు పెట్టారని సునీల్ కనుగోలుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఐపీసీ 469, 505 సెక్షన్ల కింద సునీల్ కనుగోలు టీమ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు