తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు నడుస్తున్న ఒకే ఒక్క హాట్ టాఫిక్ టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇస్తారని ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా తికమక పడుతుంది.ఈ పదవి కోసం రేవంత్ రెడ్డి వర్గం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గం పోటీ పడుతున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అంతా కోమటి రెడ్డి వైపు ఉన్నారు.మాజీ మంత్రి హనుమంత్ రావుతో సహా.ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై హనుమంత్ రావు తీవ్ర విమర్శలు చేశాడు.తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ అధిస్థానంపై తీవ్రంగా స్పందించాడు.
తాను నిజాలు బయట పెడతాను అనే భయంతోనే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని పేర్కొన్నాడు.

రేవంత్ రెడ్డి టిడిపి ని ముంచి కాంగ్రెస్ లోకి వచ్చాడు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టేదాకా రేవంత్ రెడ్డి నిద్రపోడు అని ఎద్దేవా చేశాడు.ఈ నేపథ్యంలోనే హనుమంత్ రావు నేను ఏమి భూ కబ్జాలు చేయలేదు.
నాపై ఓటుకు నోటు కేస్ లు ఏమి లేవు అన్నాడు.విజిటింగ్ కార్డ్ లు ప్రింట్ చేస్తా అని రాజకీయ నేతల చుట్టూ తిరిగిన ఆయనకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించాడు.
డిల్లీ నుండి ఏది చెబితే అది విని గంగిరెద్దుల తల ఆడించే వ్యక్తిని కాదు.అలాంటి వారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి కొత్తగా చేరారు అన్నాడు.
నేను ఫోన్ చేస్తే ఇన్ఛార్జ్ మానిక్కం ఠాగూర్ నుండి ఎలాంటి స్పందన లేదు అన్నాడు.కాంగ్రెస్ పార్టీలో కొందరు డబ్బులకు అమ్మడు పోతున్నారు అన్నాడు.
అలాగే రేవంత్ రెడ్డికి గాని టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాము చెయ్యాలిసింది చేస్తాం అన్నాడు.