తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నా ఇప్పటికే ఎన్నికల వాతావరణం పెద్ద ఎత్తున నెలకొందని చెప్పవచ్చు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
నేడు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్న విషయం తెలిసిందే.దీంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఒక్కసారిగా విమర్శలు గుప్పించడంతో పాటు పెంచిన విద్యుత్ చార్జీల విషయంలో కూడా నిరసన చేపట్టనున్నారు.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఫుల్ జోష్ లో కనిపిస్తుండటంతో రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాహుల్ తో సమావేశం తరువాత కాంగ్రెస్ లో మరింత జోష్ వచ్చిందని ఎన్ని సార్లయినా తెలంగాణకు వచ్చేందుకు రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో ఇక కాంగ్రెస్ శ్రేణులు ఇక మరింతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నిరసనలు ప్రదర్శనలు నిర్వహించడానికి సిద్దమవుతున్న పరిస్థితి ఉంది.
ఈ నిరసన ప్రదర్శనల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకుంటుందనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేక పోయినా రానున్న రోజుల్లో మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఏది ఏమైనా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తగ్గేదే లే అన్న రీతిలో వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది.
మరి కాంగ్రెస్ ను కెసీఆర్ ఎలా ఎదుర్కొంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.