వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్( Congress ) మంచి ఫలితాలను నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ.( Rahul Gandhi ) భారత్లోని ప్రసార మాధ్యమాలపై పట్టు తెచ్చుకున్న భాజపా జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా వక్రీకరణ చేస్తుందని, అయితే గాంధీ మహాత్ముని కాలం నుంచి ఇప్పటివరకు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవడం అన్నది వర్క్ అవుట్ అవుతుందని తన భారత జోడోయాత్ర ద్వారా తాను తెలుసుకున్న సత్యం ఇదేనని ఇప్పటికీ ఆ పాత విధానం పనిచేస్తుందని ఇకపై తాము ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతామంటూ ఆయన చెప్పుకొచ్చారు.

త్వరలోనే చతిస్గడ్ ,మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు జరగ బోతున్నాయని మధ్యప్రదేశ్ చతిస్గడ్ లో తమ పార్టీ దూసుకు వెళ్తుందని అక్కడ తమ విజయం ఖాయమని , రాజస్థాన్ లో( Rajasthan ) కూడా పోటీ ఉన్నప్పటికీ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో( Telangana ) కూడా తమ పార్టీ విజయానికి అవకాశం ఉందని అక్కడ బిజెపి క్షీణ దశలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా పార్లమెంట్లో కీలకమైన అంశాలు చర్చకు రాకుండా ప్రజల దృష్టిలో మరల్చడానికే జమలీ ఎన్నికలు, కులగణన , రమేష్ బిందూరి వ్యవహారం లాంటి వాటిని బిజెపి ముందుకు తీసుకు వస్తుందని అయితే బిజెపి( BJP ) వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో తాము కర్ణాటక ఎన్నికలలోనే నేర్చుకున్నామని కచ్చితంగా ఇందులో పైచేయి సాధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.మహిళా రిజర్వేషన్లకు( Women Reservation ) జనగణన డీలిమిటేషన్ వంటి వాటి తో సంబంధం లేదని నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రేపే ఈ రిజర్వేషన్లు అమలు చేయవచ్చని కేవలం ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం మాత్రమే భాజపా ఈ విధమైన ఎత్తుగడలకు పాల్పడుతుందని 2029 లో అమలు చేసే దానికి ఇప్పటినుంచే ఎందుకు ప్రవేశపెట్టారని ఆయన ప్రశ్నించారు.