రేవంత్ రెడ్డి ప్రేమ పెళ్లి కథలో ఇన్ని ట్విస్టులా.. పెద్దలను ఒప్పించి అలా పెళ్లి చేసుకున్నారా?

తాజాగా తెలంగాణలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.దీంతో నిన్న మధ్యాహ్నం నుంచే ఆయన సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు.

 Congress President Revanth Reddys Love Story Is Trending On Social Media, Revant-TeluguStop.com

అంతేకాకుండా ప్రస్తుతం ఏపీ తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి పేరు మారు మోగిపోతోంది.అలాగే సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు.బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ముఖ్యపాత్ర పోషించారు.

Telugu Love, Love Story, Revanth Reddy-Latest News - Telugu

ఇక ఎన్నికలు ఫలితాలు వెల్లడైన దగ్గర నుండి సోషల్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డి పేరు మారుమోగిపోతుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఆయన లవ్ స్టోరీ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.రేవంత్ రెడ్డి స్టూడెంగ్‌ గా ఉన్న సమయంలో ఏబీవీపీ లీడర్‌గా ఉన్నారు.ఓయూ వంటి వాటిలో పలు కార్యక్రమాలు చేశారు.విద్యార్థుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారట.ఇక ఆ సమయంలోనే స్టూడెంట్ గా ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డితో( Geeta Reddy ) ప్రేమలో పడ్డారట.

ఆ తర్వాత ఈ విషయం జైపాల్ రెడ్డి తమ్ముడికి తెలిసిందట.ఆయన రేవంత్‌కు తన కూతురు గీతా రెడ్డిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడలేదట.

Telugu Love, Love Story, Revanth Reddy-Latest News - Telugu

దీంతో ఆయన కూతురిని అన్న జైపాల్ రెడ్డి ఇంటికి ఢిల్లీకి ( Delhi )పంపించారట.దీంతో రేవంత్ రెడ్డి ఆయన‌తో పరిచయం ఏర్చరుకుని జైపాల్ రెడ్డిని తమ పెళ్లికి ఒప్పించాడు.ఆ తర్వాత జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి లోని ధైర్యాన్ని, టాలెంట్‌ని చూసి ఎప్పుటికైనా మంచి స్థాయికి వెళ్తాడని భావించి తన తమ్ముడిని ఒప్పించాడట.అంతేకాకుండా రేవంత్ రెడ్డి, గీతా రెడ్డిల పెళ్లి జరిపించారట.

అయితే ఇద్దరిది సేమ్ క్యాస్ట్ కావడంతో జైపాల్ రెడ్డి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఎన్నికష్టాలు ఎదురైనప్పటికీ మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.

వీరిద్దరికి ఒకే కూతురు కూడా ఉంది.తెలంగాణ సీఎం కావడంతో రేవంత్ రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube