రేవంత్ రెడ్డి దూకుడు కనిపించదేం?

ఒకవైపు అధికార బీఆర్‌ఎస్ పార్టీ ( BRS party )మూడో సారి అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా పథకాలను ప్రవేశ పెడుతూ జనాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది.

 Congress President Revanth Reddy Not Getting Aggressive , Revanth Reddy ,bjp ,br-TeluguStop.com

మరో వైపు కేంద్రం లో అధికారం లో ఉన్న బిజెపి తెలంగాణ లో కూడా అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది.రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ప్రతి విషయం లో కూడా ముందుంటున్నాడు.

Telugu Bandi Sanjay, Congress, Revanth Reddy, Ts-Politics

ఇటీవల పరీక్ష పేపర్ లీకేజీ విషయం లో బండి సంజయ్ చేసిన హడావుడి అంతా అంతా కాదు, ఆ సమయం లో కాంగ్రెస్ పార్టీ ( Congress party )పెద్దగా కనిపించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి.అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే ఆ పార్టీ నాయకుల నుండి పెద్దగా స్పందన లేదు.ఇదే ఏడాది లో ఎన్నికలు రాబోతున్నాయి.ఆరు నెలల సమయం కూడా లేక పోయినా కూడా కనీసం పట్టింపు లేనట్లుగా రేవంత్ వ్యవహరిస్తున్నాడు అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

పార్టీలో వర్గ విభేదాలు కారణంగా రేవంత్ రెడ్డి దూకుడు కనిపించడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే వారు ఇంకా లక్షల మంది ఉన్నారు.

వారిని ఉపయోగించుకుంటే పార్టీని అధికారంలోకి తీసుకు రావచ్చు అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వారిని ఏక తాటి పైకి తీసుకు రావడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఏంటి అంటే శూన్యం అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Telugu Bandi Sanjay, Congress, Revanth Reddy, Ts-Politics

రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పార్టీ లో వచ్చిన మార్పులపై సీనియర్లు మాట్లాడుకుంటూ ఎన్నో నష్టపోయాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి రేవంత్ రెడ్డి విషయం లో సీనియర్లతో పాటు పార్టీ అధినాయకత్వం కూడా మెల్ల మెల్లగా అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ రాజకీయ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అదే జరిగితే రేవంత్ రెడ్డిని అధ్యక్ష పదవి నుండి తొలగించే అవకాశాలు లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube