మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయా భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరిలో ఆసక్తి రేపుుతుంది.ఇనాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి తాజా పరిణామంతో ఆయన రాజకీయాలపై ఓ నిర్ణయానికి వచ్చేలా తప్పడం లేదు.
ప్రస్తుతం ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, అయితే రాజకీయాలు మాత్రం తన నుంచి పోలేదని తాజాగా విడుదల చేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే చీరంజీవి బీజేపీ చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్ ఆసక్తిగా మారాయి.చిరంజీవికి ఆసక్తి ఉంటే ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
ఈ సమయంలోనే చిరును పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డును జారీ చేసింది.ప్రస్తుతం ఈ విషయం పోటికల్ సర్కిల్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఓటు వేయడానికి ఐడి కార్డులను జారీ చేస్తోంది.

ఆ ప్రతినిధుల్లో చిరంజీవి కూడా ఉన్నట్లు సమాచారం.ఈ పరిణామాన్ని చిరంజీవిని వీడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని, ఇంకా ఆయన్ను పార్టీ సభ్యుడిగానే చూస్తోంది.అయితే చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు.ఇప్పుడిక బంతి చిరంజీవి కోర్టులో ఉంది.
కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను ఆయన అంగీకరిస్తారా లేక రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచనకు కట్టుబడి ఉంటారా అన్నది తెలియాలి.దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ ఆయన కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంటే రాజకీయంగా తమ్ముడు పవన్‌కు కొన్ని అడ్డంకులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.







