మంత్రి సత్యవతి రాథోడ్‌కు చేదు అనుభవం ఎదురైంది.సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది.
ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించేందుకు మంత్రి వెళ్లారు.అయితే ఈ కార్యక్రమానికి కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు.
దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నా మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.







