వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాంగ్రెస్ ( Congress )దే ఆదిక్యమంటూ అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి.ఇక కాంగ్రెస్ నేతలు అయితే విజయోత్సవాలకు అప్పుడే సిద్ధమైపోయారు కూడా.
రాష్ట్ర స్థాయి నాయకులే కాకుండా కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణను గెలుస్తామని మానసికంగా సిద్ధమైపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇకపై తెలంగాణ( Telangana ) కేంద్రంగా దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని, ఇటు మహారాష్ట్ర నుంచి అటు ఆంధ్రప్రదేశ్ వరకూ రాజకీయాలను హైదరాబాద్ కేంద్రంగా నడిపించాలని కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయ్యారట.

భౌగోళికంగా కూడా తెలంగాణ అనుకూల ప్రాంతంగా ఉంటుంది కాబట్టి ఇకపై తెలంగాణను కాంగ్రెస్కు అడ్డాగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ( United Andhra Pradesh )కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది .ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో కూడా దేశమంతా కాంగ్రెస్ ను ఓడించినా గెలిపించిన చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ది .అనేక వ్యూహాత్మక తప్పిదాలతో తెలుగు రాష్ట్రాలను చేజార్చుకున్న కాంగ్రెస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టువీడకూడదనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తుంది .ఒకసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మిగిలిన అవసరాలన్నీ అవే నెరవేరుతాయి అన్న ఆలోచనలు కాంగ్రెస్ అధిష్టానం ఉందట .

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో( assembly elections ) ముఖ్యంగా తెలంగాణ మరియు మధ్యప్రదేశ్ ను గెలుచుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో పని చేయవచ్చన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది.మరోపక్క కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ,ఆధిక్యం పైనే ఆలోచన తప్ప గెలుపు పై సందేహం లేదంటూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అప్పుడే ముఖ్య మంత్రి పదవిపై జోరుగా ఊహాగానాలు కూడా షికారు చేస్తున్నాయి.
కొంతమంది రేవంత్ కే అధికార పీఠం అంటుంటే మరి కొంతమంది బట్టి విక్రమార్క వంటి సౌమ్యుడిని కేంద్ర కాంగ్రెస్ పరిశీలించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.ఏది ఏమైనా కాంగ్రెస్కు మంచి కాలం మొదలైనట్లే కనిపిస్తుంది
.