బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా:గడీల కాపలా కుక్క బాల్క సుమన్( Balka Suman ) బలుపు మాటలు బంద్ చేయాలని, బేషరతుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )కి బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామిరెడ్డి డిమాండ్ చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు.

 Congress Party Leaders Comments On Balka Suman ,balka Suman, Cm Revanth Reddy,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు తెలంగాణ సంపదను లూటీ చేసిన కేసిఆర్ ( KCR )కుటుంబ గడీల దగ్గర కాపల కుక్కలా ఉన్న బాల్క సుమన్ కు సీఎం రేవంత్ రెడ్డిని,కాంగ్రెస్ పార్టీ అనే హక్కు లేదన్నారు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగితే చెప్పుల దండలు వేసి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, పేద ప్రజల అవసరాల కొరకు ప్రజా పరిపాలన నడిపిస్తున్న రేవంత్ రెడ్డిని ఒక్క మాటన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అన్నపర్తి యాదగిరి,ఇమ్మడి దశరథ, పొన్నగని నారాయణ,అత్తి సత్తయ్య,రవికుమార్,భాస్కర్,షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube