జీవా ప్రధాన పాత్రలో మహి వి రాఘవ్( Mahi V Raghav ) డైరెక్షన్ లో యాత్ర2 మూవీ ( Yatra 2 movie )తెరకెక్కగా ఈ నెల 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.యాత్ర2 సినిమకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుకాలేదు.రిలీజ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో బుకింగ్స్ మొదలైతే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే యాత్ర2 మూవీ 40 నుంచి 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిందని తెలుస్తోంది.
జీవా, మమ్ముట్టి( Jeeva, Mammootty ) రెమ్యునరేషన్ల కోసం భారీగా ఖర్చైందని అదే సమయంలో ఈ సినిమా కోసం ఎక్కువమంది జూనియర్ ఆర్టిస్టులు పని చేశారని తెలుస్తోంది.స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ఈ సినిమాకోసం ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.
మరి ఈ సినిమాకు ఆ రేంజ్ లో బిజినెస్ జరిగిందా? అనే ప్రశ్నలకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

వైసీపీ నేతలు మాత్రం ఈ సినిమా కచ్చితంగా హిట్ కావాలని భావిస్తున్నారు.యాత్ర2 మూవీ ఎన్ని థియేటర్లలో రిలీజ్ కానుందనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది.యాత్ర2 సినిమా తమ పార్టీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు ఫీలవుతున్నారని తెలుస్తోంది.యాత్ర2 సినిమాకు ప్రమోషన్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరగడం లేదని తెలుస్తోంది.

ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా తెరకెక్కడం ఈ సినిమాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది.యాత్ర2 సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తే యాత్ర3 మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది.యాత్ర3 మూవీ జగన్ సీఎంగా చేసిన కార్యక్రమాల గురించి ప్రధానంగా ఉండబోతుందని సమాచారం అందుతోంది.వైసీపీకి అనుకూలంగా మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.







