ఆర్టికల్ 370పై కాంగ్రెస్ కి ఊహించని దెబ్బలు! పంతన లేని నేతలు

దేశం యావత్తు హర్షించే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు చేయడం.

దీనిని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ కి ఉన్న ప్రత్యేక హక్కులని మొత్తం దూరం చేసింది.

ఈ నిర్ణయంతో ఒక్కసారిగా దేశంలో ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.ఒక్కసారిగా ఈ నిర్ణయంతో మోడీ మీద దేశ ప్రజల అభిమానం కూడా ఆకాశాన్ని తాకింది.

ఒక సర్దార్ పటేల్, ఒక అటల్ బీహార్ వాజ్ పేయి తర్వాత ఇప్పుడు మోడీ ఆ స్థాయిలో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు అని కొనియాడుతున్నారు.ఇదిలా ఉంటే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కొంత మంది రాజకీయ నాయకులు మద్దతు పలుకుతూ ఉండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఆర్టికల్ ని రద్దు చేయడంపై తీవ్రంగా విమర్శలు చేస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్టికల్ 370 విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా అయ్యింది.

Advertisement

కొంత మంది నేతలు బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే, కొంత మంది మాత్రం బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు.దీంతో పార్టీలో ఒకరికి ఒకరికి ఏకాభిప్రాయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించగా రాహుల్ టీం లో కీలక నేతగా ఉన్న జ్యూతీరాదిత్యా సింధియా మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై తన మద్దతు ప్రకటించాడు.అలాగే రాజ్యసభలో కూడా కొంత మంది కాంగ్రెస్ ఎంపీలు రద్దు నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.

దీంతో ఇప్పుడు బీజేపీ తీసుకున్న ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీని సైతం విచ్చిన్నం చేసింది అనే అభిప్రాయం వినిపిస్తుంది.

ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

Advertisement

తాజా వార్తలు