తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.నాలుగు నెలల్లోనే అన్ని చేసినట్లు రేవంత్ రెడ్డి భ్రమిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన రైతులను మోసం చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.కాంగ్రెస్ అంటేనే మోసం, దగా అని ఎద్దేవా చేశారు.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందన్నారు.హామీలను విస్మరించినందుకు కాంగ్రెస్ ను( Congress ) ఓడించేందుకు ప్రజలు సిద్ధమని చెప్పారు.ఈ క్రమంలోనే సీఎం స్థాయి నుంచి దిగజారి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మాట్లాడుతున్నారని తెలిపారు.రూ.39 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.కొడంగల్ లో ఓడితే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తానన్నారు.
చేశారా అని ప్రశ్నించారు.