ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఆ క్రెడిట్ దక్కించుకోవటంలో కాంగ్రెస్ విఫలమైన పరిస్థితిలో ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్ చాలా ఎన్నికల్లో ఘోరంగా విఫలమవుతూ వస్తున్న పరిస్థితి ఉంది.
అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అంతర్గత విభేదాలతోనే పెద్ద ఎత్తున ప్రజల్లో పలుచనవుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇంకా కాంగ్రెస్ నాయకులు ఐక్య ఎజెండాతో కాకుండా స్వంత ఎజెండాతో ముందుకు వెళ్తుండటంతో కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల దృష్టి ఆకర్షించుకోలేక పోతోంది.
అయితే ఎంతగా ఎదురుదెబ్బలు తాకినా రేవంత్ నాయకత్వాన్ని మాత్రం కొంత మంది అంగీకరించడానికి ససేమిరా అంటున్న తరుణంలో రేవంత్ ఇప్పటికే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇక రేవంత్ తనతో కలిసి వచ్చే వారితో ముందుకు నడుస్తున్న పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ నేతల వైఖరితో కాంగ్రెస్ బలంగా ప్రజల్లో ఎదగడానికి మంచి అవకాశాలు వచ్చినప్పుడల్లా అందరూ కలిసికట్టుగా శ్రమించకపోవడం వల్ల ఇక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేసేది ఏమీ లేక పార్టీని కూడా ప్రజల్లో బలంగా తీసుకెళ్లలేక పోతున్న పరిస్థితి ఉంది.
అయితే కాంగ్రెస్ పరిస్థితిని, అవలంబిస్తున్న విధానాలపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర అభిప్రాయాలను వెళ్ళిబుచ్చుతున్నారు.రాజకీయ పార్టీకి తమ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా ఇతర పార్టీ నేతలు వ్యాఖ్యానించినప్పుడు ఖచ్చితంగా దానిని చక్కని అవకాశంగా మలుచుకుని గట్టిగా పోరాడితే ప్రజల దృష్టి తమ పార్టీవైపు మరల్చడానికి ఒక అవకాశం దొరుకుతుందని, కాని తాజాగా మోడీ కాంగ్రెస్ పై సాక్షాత్తు పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేసినా కూడా తెలంగాణ కాంగ్రెస్ అంతగా స్పందించలేదనే అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.