హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది.ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం హన్మంతరావు నివాసానికి వెళ్లారు.
భట్టి విక్రమార్కతో పాటు మల్లు రవి, దామోదర రాజనర్సింహా, అంజన్ కుమార్ యాదవ్ మైనంపల్లిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ క్రమంలోనే ఈనెల 27వ తేదీ లోపు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.
ఢిల్లీకి వెళ్లనున్న ఆయన మాజీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.తనతో పాటు తన కుమారుడికి కూడా హస్తం పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తుందని మైనంపల్లి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి రెండు రోజుల క్రితమే తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించిన సంగతి తెలిసిందే.