దుబ్బాక ఉప ఎన్నికలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రేపుతున్నాయి.ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృ ప్తికి గురవుతున్నారు.
దుబ్బాక ఎన్నికలను రాష్ర్ట స్థాయిలో హైప్ తీసుకువచ్చి తీరా మూడవ స్థానానికి పరిమితం కావడం పట్ల తెలంగాణ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ పై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు.ఆయన వ్యవహార శైలి, అనవసరమైన హడావిడినే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మూడవ స్థానానికి తీసుకొచ్చిందని ఆపార్టీలోని ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారేందుకు మూల కారణమే మాణికం అని సొంత పార్టీ వారే చెబుతున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ నేతల మధ్య ఇదే చర్చ జరుగుతోంది.
ఒక వైపు కాంగ్రెస్ మూడవ స్థానానికి పోవడం, దీనికి తోడు రాష్ర్టంలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపినే అనే రాజకీయ వాతావరణం రావడం కాంగ్రెస్ నేతలను వేధిస్తోంది.దుబ్బాక ఉప్ప ఎన్నికల ఫలితల ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై పడడం కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోవడం లేదు.
దుబ్బాక ఉప ఎన్నికలను లైట్గా తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండేది కాదని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్గా కొత్తగా ఠాగూర్ బాధ్యతలు చేపట్టడం ఆ తర్వాత వెంటనే దుబ్బాక ఉప ఎన్నికలు రావడం తెలిసిందే.టిఆర్ ఎస్ రెండవ సారి అధికారంలోనికి వచ్చిన తర్వాత తొలి ఉప ఎన్నికకావడం అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లాలో ఉప ఎన్నికలు రావడంతో ఠాగూర్ దీనిని ప్రతిష్ఠత్మకంగా తీసుకున్నారు.తాను ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి ఎన్నికలు కావడంతో తన సత్తా చాటాలని, తద్వారా జాతీయ నాయకత్వంతో శభాష్ అనిపించుకోవాలని మాణిక్కం ఠాగూర్ అనుకున్నారు.
అందుకే దుబ్బాక ఎన్నికల్లో పెద్ద హడావిడే చేశారు.ఉప ఎన్నికల్లో గెలిచేందుకు మాణిక్కం ఠాగూర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.ఈ హడావిడి అంతా చూసి ఇక హస్తంలో కాస్త మార్పు వచ్చిందని, నేతల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ అంతా ఒక వేదిక మీదకు రావడం ఆ పార్టీ వర్గాల్లో కొంత జోష్ నింపింది.ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నది.
కానీ దుబ్బాక ఫలితాల తర్వాత ఆ జోష్ కనుమరుగైంది.ఉన్న నేతలే మెల్ల మెల్లగా చే జారుతున్నారు.
నిత్యం కాంగ్రెస్కు వీరవిదేయులుగా ఉన్న వారు కూడా కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధపడ్డారు.దీంతో దీనికంతటికీ మాణిక్కం ఠాగూర్ కారణమనే అభిప్రాయానికి కాంగ్రెస్ నేతలు వచ్చారు.
సాక్షాత్తూ టిపిసిసి ముఖ్యనేతల్లో ఒకరిద్దరు మాణిక్కం ఠాగూర్ పై తీవ్ర అసహానం, అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.