ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన హాస్యనటుడు అలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు.రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
గతంలో AP CM జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా పరిశ్రమలోని తన సన్నిహితులపై విమర్శల దాడి చేశారు అలీ.ఆయనకు రాజ్యసభ బెర్త్ ఇస్తారని అంతా భావించారు.చివరకి కంటి తుడుపుగా మీడియా సలహాదారు పదవి ఇచ్చారు.
దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రభుత్వం అలీకి అలాంటి పదవిని ఇవ్వడం సిగ్గుచేటని, అయితే అలాంటి అర్థంలేని, పనికిరాని పదవిని అంగీకరించే ముందు అలీకి కనీసం ఆలోచించాలని దుయ్యబట్టారు.
ప్రభుత్వంలో ఇప్పటికే 50 మందికి పైగా సలహాదారులు ఉన్నారని ఆయన తెలిపారు.ఆ స్థానంలో పని లేకపోవడంతో చాలా మంది రాజీనామా చేశారు.ఇప్పటికే రామ్‌చంద్రమూర్తి, కృష్ణమోహన్ తదితరులు సలహాదారులుగా పనిచేస్తున్నప్పుడు అలీ రూపంలో మరో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అవసరం ఏమొచ్చింది? హాస్యనటుడు అలీని వైఎస్ఆర్ ప్రభుత్వం ఫూల్ చేసిందని తులసిరెడ్డి అన్నారు.ఆ పదవిని స్వీకరించే ముందు తెలివిగా ఆలోచించాలని కూడా అలీని కోరాడు.
2019 ఎన్నికల ముందు టీడీపీ నుండి వైసీపీలో చేరిన ఆలీ ఆ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేశారు.

ముస్లీం ఓటును వైసీపీకి సాదించి పెట్టడంలో కీలకంగా వ్వవహరించిన జగన్ ప్రాధన్యత పదవి ఇస్తారని ఎదురు చూేశారు.చివరకు ఆ ప్రాధన్యత పదివి ఇవ్వడంతో అయిష్టంగా దాన్ని స్వీకరించారు.అయితే వచ్చే ఎన్నికల్లో ఆలీకి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ ప్రముఖులు చెబుతున్నారు.
లేక ఎమ్మెల్సీ పదివి కూడా ఇవ్వవచ్చు అని నేతలు అభిప్రాయపడున్నారు.రాజమండ్రి ప్రాంతానికి ఆలీ సినిమాల్లో న్రయాత్నల్లో భాగంగా మెుదట చెన్నైలో స్థిరపడ్డారు.ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు రావడంతో అక్కడి నుండి మకాం మార్చారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై దృష్టి సారించారు.