జ్యోతిష్యుడు చెప్పాడని ప్రియుడిని హత్య చేసింది ఓ యువతి.కేరళలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
పథకం ప్రకారం యువతి, ఆమె కుటుంబ సభ్యులు కలిసి ప్రియుడిని హతమార్చారు.యువతి జాతకం ప్రకారం మొదటి భర్త చనిపోతాడని ఓ జ్యోతిష్యుడు చెప్పాడు.
ఆ మాటలు నమ్మిన యువతి ప్రియుడికి స్లో పాయిజన్ ఇచ్చి దారుణానికి ఒడిగట్టింది.గతంలో ప్రియుడికి బ్రేకప్ చెప్పి మరో యువకుడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది.
జ్యోతిష్యుడి మాటతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న వ్యక్తితో పెళ్లి కోసం మళ్లీ ప్రియుడుకు యువతి దగ్గరైంది.ఈ క్రమంలోనే షరోన్ ను పిలిపించి సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది.
అయితే విష ప్రభావంతో 14 రోజులు మంచం పట్టి ప్రియుడు షరోన్ చనిపోయాడు.మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.
ప్రియురాలే హత్య చేసినట్లు గుర్తించారు.







