మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Working President KKTR ) కు కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ లో నోటీసులు పంపారని తెలుస్తోంది.సిరిసిల్లలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాణిక్కం ఠాగూర్ నోటీసులు ఇచ్చారు.
కేటీఆర్ పై పరువునష్టం దావా వేస్తానని మాణిక్కం ఠాగూర్ నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే తన నోటీసులకు వారంలో సమాధానం ఇవ్వాలని ఆయన తెలిపారు.
లేని పక్షంలో కోర్టుకు వెళ్తామని మాణిక్కం ఠాగూర్( Congress Manickam Tagore ) వెల్లడించారు.పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణిక్కం ఠాగూర్ పై బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో మాణిక్కం ఠాగూర్ నోటీసులు పంపించారు.