మంత్రి పువ్వాడ అజయ్ నీ బర్తరఫ్ చేసి, కేసు నమోదు చెయ్యాలి- కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి డిమాండ్

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ అరాచకాలు ఎక్కువయ్యాయని, పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టిస్తూ,వేధింపులకు గురి చేస్తున్నాడని కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి ఆరోపించారు.ఈ మేరకు జగ్గా రెడ్డి, మీడియాకు ప్రకటన విడుదల చేసారు.

 Congress Leader Jaggareddy Serious Comments On Minister Puvvada Ajay Details, Co-TeluguStop.com

పువ్వాడ మంత్రి అయిన దగ్గర నుంచి ఖమ్మం జిల్లాలో అరాచకాలు ఎక్కువ అయ్యాయి అని, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రతి పక్ష పార్టీల వారిపై అక్రమ కేసులు పెడుతూ, జైలు పాలు చేస్తూ, పిడీ యాక్ట్ లు పెడుతూ, భయాందోళన కు గురి చేస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, జైలు పలు చేసిన సమయంలోనే డీజీపీనీ కలిసి ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తోసుకోలేదని, ముఖ్యమంత్రి కూడ పట్టించుకోలేదని అన్నారు.

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టిలో మార్కులు కొట్టేసేందుకు, అప్రజాస్వామిక పద్దతిలో సైకో లాగా పువ్వాడ ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు.ఇంకా ఆలస్యం చెయ్యకుండా ఖమ్మం లో మంత్రి పువ్వాడ అరాచకాల పై కేసీఆర్ దృష్టి సారించి వెంటనే మంత్రి వర్గం నుంచి పువ్వాడ అజయ్ నీ బర్తరఫ్ చేసి, కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వేధింపుల తాళలేక ఖమ్మం లో బిజెపి కార్యకర్త ,యువకుడు మృతి చెందడం బాధాకరం అని, వాంగ్ములం తీసుకోవాల్సిన పోలీసులు, బాధ్యత మరిచి వాంగ్మూలం రికార్డ్ చేయకపోవడం నేరమని, మృతుడు సాయి గణేష్ మీడియాకి ఇచ్చిన చివరి వాయిస్ నీ ఆధారంగా చేసుకొని ఘటనకు బాధ్యులైన మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు అధికార పార్టీ నేతలు, పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి, కేసులు నమోదు చేసి అరెస్ట్ చెయ్యాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube