సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు స్పెషల్ మెసేజ్ ఇచ్చిన బాలీవుడ్ సింగర్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం విదితమే.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Armaan Malik Has A Special Message For Mahesh Babu Fans, Mahesh Babu Fans, Armaa-TeluguStop.com

ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యి చార్ బస్టర్ గా నిలిచాయి.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి వచ్చే పాటల కోసం అభిమానులంతా ఎదురు చూసారు.

ఇప్పటికే వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.దీంతో మరో సాంగ్ ఎప్పుడు ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.ఈయన సంగీతం అందిస్తున్నాడు అంటే సూపర్ హిట్ అవుతుంది అని ఇటీవల నిరూపిస్తున్నాడు.నెక్స్ట్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో థమన్ అభిమానులను ఊరిస్తూ మహేష్ అభిమానులలో మరింత ఉత్కంఠ పెంచుతున్నాడు.

అయితే మూడవ పాట ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు.ఈ సింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ ఆయనపై మహేష్ ఫ్యాన్స్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.దీంతో ఈ సింగర్ మహేష్ అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ చేసారు.అర్మాన్ మాలిక్ ఇదే విషయాన్నీ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

”నాకు సందేశం పంపే మహేష్ అభిమానులందరికి చెబుతున్నాను.సర్కారు వారి పాటలోని పాట ఎప్పుడు విడుదల అవుతుందో నాకు తెలియదు.

ఈ సాంగ్ ను వినడానికి మీరంతా ఎంత ఆతృతగా ఉన్నారో నేను కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ప్రెసెంట్ అధికారిక ప్రకటన కోసం ఓపికగా ఎదురు చూడడమే మనం చేయగలిగింది” అంటూ చెప్పుకొచ్చారు.

ఈయన ఇప్పటికే మన టాలీవుడ్ లో బుట్టబొమ్మ సాంగ్ చేసారు.ఇది సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు సర్కారు లో పాడే సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

https://twitter.com/ArmaanMalik22/status/1515543511600226307?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1515543511600226307%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fmovie-news%2Farmaan-malik-has-a-message-for-mahesh-babu-fans-157018.html
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube