టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రభుత్వ యంత్రాంగం, రైసు మిల్లర్ల మధ్య రైతులు నలిగిపోతున్నారన్నారు.
రైతు తన పంటను అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని మండిపడ్డారు.రైతుకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు, ప్రతిదాడులతో కాలక్షేపం చేస్తున్నాయని విమర్శించారు.
అందుకే రైతు కోసం రణం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైందని రేవంత్ రెడ్డి తెలిపారు.







