ప్రభాస్ హీరో గా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల ఆయన సందర్భంలోనే తేజ సజ్జా మరియు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రూపొందుతున్న హనుమాన్ సినిమా యొక్క టీజర్ విడుదల అవ్వాల్సి ఉంది.కానీ రాముడు వస్తున్న సమయంలోనే హనుమాన్ రావడం కరెక్ట్ కాదని దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఆ సమయం లో టీజర్ ని విడుదల వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఎట్టకేలకు ఆ టీజర్ ని విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.హనుమాన్ టీజర్ యొక్క విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా లీక్ ఇచ్చారు.
కనుక ఈ సినిమా మరో విజువల్ వండర్ గా తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించే విధంగా ఉండబోతుందని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మీడియా తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా ఈ సినిమా పై పదే పదే వ్యాఖ్యలు చేయడం తో కచ్చితం గా మేటర్ ఉన్న సినిమా అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు.హనుమాన్ సినిమా లో ఒక సూపర్ మాన్ కథ ని చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాబోతున్న మొదటి సూపర్ మాన్ సినిమా ఇదే అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా హైప్ క్రియేట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు.మరి ఆ స్థాయిలో ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే త్వరలో విడుదల కాబోతున్న టీజర్ ని చూడాలి.
టీజర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతాయా లేదంటే తగ్గుతాయా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.







