ప్రస్తుతం రాజకీయ పార్టీలు అన్నింటికీ ఒక జాడ్యం పట్టుకుంది.అదేమిటంటే సభ్యత్వ నమోదు.
తమ ఉనికిని తాము ప్రకటించుకునే దిశగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి.ఒక పక్క తెలుగు దేశం పార్టీ సీమంధ్ర కేంద్రంగా చెలరేగిపోతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 40లక్షలకు చేస్తూ ముందుకు దూసుకు పోతుంటే ఇక మరో పక్క తెలంగాంలో కొంగ్రెస్ సైతం పార్టీ సభ్యత్వ నమోదును సీరియస్ గా తీసుకుని తమ లక్ష్యం 25లక్షలు అని ప్రకటించుకుంది.
ఎంత కాదన్నా తెలంగాణాలో కొంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కదా ఆ మాత్రం ఉండకపోతే ఎలా మరి.ఇంతవరకు ఎలా ఉన్నా లక్ష్యం అయితే బలంగా ఉంది కానీ నమోదు కార్యక్రమం మొదలైతే కానీ చెప్పలేం ఎందుకంటే కొంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటల పుణ్యమా అంటూ లక్ష్యం నీరుగారిపోయినా ఆశ్చర్యం ఏమీ లేదు.అయితే వారంతా కలసి కట్టుగా పనిచేస్తే మాత్రం 25కాకపోయినా కనీసం 20లక్షల సభ్యత్వాలను నమోదు చేయించ వచ్చు.మరో పక్క తెలుగు దేశానికి కేవలం 7లక్షల సభ్యత్వాలే లభించడంతో కొంగ్రెస్ కొంచెం ఒళ్ళు వంచి కష్ట పడితే మాత్రం తెలుగు దేశాన్ని కిందకు నెట్టి పై చేయి సాదించడం ఖాయం.
మరి చూద్దాం ఏం జరుగుతుందో.







