ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది.ఈ ఏడాది అది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు రగనున్నాయి.
దీంతో ప్రస్తుతం అన్నీ పార్టీలు ఎలక్షన్ మూడ్ లో ఉన్నాయి.ఇకపోతే ఐదు రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్.ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ, కాంగ్రెస్( BJP ,Congress ) పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి.ఎందుకంటే ఈ ఎన్నికలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు.అయితే ఐదు రాష్ట్రాల్లో విజయంపై బీజేపీ( bjp )తో పోల్చితే కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది.ఆల్రెడీ రాజస్తాన్, మద్య ప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలు ముగిశాయి.
ఇక మిగిలింది కేవలం తెలంగాణ మాత్రమే.ఇక్కడ కూడా మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి డిసెంబర్ 3 న ఫలితాలు వెలువడనున్నాయి.కాగా ప్రస్తుతం ఈ ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోందని హస్తం నేతలు ధీమాగా ఉన్నారు.

రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు కూడా తేల్చి చెబుతున్నాయి. మిజోరాంలో మాత్రం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.ఇకపోతే తెలంగాణ విషయానికొస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ యమ దూకుడు ప్రదర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ.ప్రస్తుతం ఉన్న సమీకరణల దృష్ట్యా బిఆర్‌ఎస్ ( BRS party )కు హస్తం పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాంతో తెలంగాణలో కూడా విజయం తథ్యం అనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.మొత్తంమీద మిజోరాం మినహా రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం కన్ఫర్మ్ అనేది ఆ పార్టీ నేతల అంచనా.
మరి కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకుంటుందా లేదా డీలా పడుతుందా అనేది డిసెంబర్ 3 న తేలిపోనుంది.