కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి( Rahul Gandhi ) మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.మ్యానిఫెస్టోల పేరుతో కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇస్తోందని పేర్కొన్నారు.
హామీలు ఇచ్చి విస్మరించడం కాంగ్రెస్ పార్టీ( Congress Party )కే అలవాటేనని విమర్శించారు.మ్యానిఫెస్టో( Manifesto )ల పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేయవద్దని తెలిపారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇస్తున్నారని ఆయన లేఖలో ప్రస్తావించారు.అయితే కాంగ్రెస్ న్యాయ్ పత్ర పేరుతో జాతీయ మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.