టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు పరశురామ్( Director Parasuram ) కు ప్రత్యేక గుర్తింపు ఉంది.యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరశురామ్ తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకున్నారు.
పరశురామ్ రెండో సినిమా రవితేజ హీరోగా ఆంజనేయులు( Anjaneyulu ) టైటిల్ తో తెరకెక్కగా ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా మాత్రం హిట్ గా నిలిచింది.మూడో ప్రయత్నంలో సోలో సినిమాతో పరశురామ్ మరో సక్సెస్ అందుకున్నారు.
సారొచ్చారు సినిమాతో పరశురామ్ ఖాతాలో భారీ ఫ్లాప్ చేరింది.సారొచ్చారు సినిమా( Sarocharu ) నిర్మాతలకు భారీ నష్టాలను మిగల్చడంతో కొన్నేళ్ల పాటు పరశురామ్ కు మూవీ ఆఫర్లు రాలేదు.2016 సంవత్సరంలో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పరశురామ్ ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు.
శ్రీరస్తు శుభమస్తు( Srirastu Subhamastu ) సక్సెస్ తర్వాత గీతా గోవిందం సినిమాతో పరశురామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు.మరోవైపు విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కూడా గీతా గోవిందం అనే సంగతి తెలిసిందే.గీతా గోవిందం సక్సెస్ తో పరశురామ్ కు మహేష్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ రాగా సర్కారు వారి పాట సినిమా( Sarkaru Vaari Paata ) యావరేజ్ సినిమాగా నిలిచింది.
కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు నష్టాలు సైతం వచ్చాయి.ఫ్యామిలీ స్టార్ తో సైతం పరశురామ్ మరో భారీ హిట్ ను అందుకోలేకపోయారు.
రొటీన్ కథ, కథనం, విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ, సెకండాఫ్, కొన్ని సన్నివేశాల్లో మృణాల్ యాక్టింగ్, పాటలు ఆసక్తికరంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.ఫ్యామిలీ స్టార్ కు 43 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.ఫ్యామిలీ స్టార్ సినిమా( Family Star )కు విజయ్ దేవరకొండ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.