తెలంగాణలో మూడు పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్( Congress ) పెండింగ్ లో పెట్టింది.ఈ పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఇవాళ లేదా రేపు అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.
కాగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయన్న సంగతి తెలిసిందే.వీటిలో ఖమ్మం లోక్ సభ స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ నియోజకవర్గ టికెట్ కోసం ఆశావాహులే కాకుండా ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు.ఈ క్రమంలోనే ఖమ్మం అభ్యర్థి ఎంపికపై కరీంనగర్ అభ్యర్థి ఎంపిక సైతం ఆధారపడి ఉందని తెలుస్తోంది.
కరీంనగర్ టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వెల్చాల రాజేందర్ రావు( Former MLA Praveen Reddy , Velchala Rajender Rao ) ఉన్నారు.ఇక హైదరాబాద్ లోక్ సభ టికెట్ పై కూడా కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది.
కాగా ఈ స్థానాల అభ్యర్థులపై ఈ రెండు రోజుల్లో క్లారిటీ రానుందని సమాచారం.