సూర్యాపేటలో ఫలించిన కాంగ్రెస్ బుజ్జగింపులు..వెనక్కి తగ్గిన రెబల్ అభ్యర్థి

సూర్యాపేటలో హస్తం పార్టీ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించాయి.ఈ మేరకు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నిలిచిన పటేల్ రమేశ్ రెడ్డి వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

 Congress Appeasement In Suryapet..rebel Candidate Who Backed Down-TeluguStop.com

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో పటేల్ రమేశ్ రెడ్డి నామినేషన్ ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు.ఈ మేరకు ఎంపీ టికెట్ ఇస్తామని కేసీ వేణుగోపాల్ మాట ఇవ్వగా రాతపూర్వక హామీతో పటేల్ రమేశ్ రెడ్డి వెనక్కి తగ్గారు.

అయితే హస్తం పార్టీ నేతలు రమేశ్ రెడ్డి నివాసానికి వచ్చిన సమయంలో ఆయన అనుచరుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అయితే పార్టీ ముఖ్యనేతలు రాతపూర్వక హామీ ఇవ్వడంతో పటేల్ రమేశ్ రెడ్డి అనుచరులు కూడా వెనక్కి తగ్గారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube