ఏపీ రాజధాని అమరావతి విషయంలో కేంద్ర అధికార పార్టీ బిజెపి మొదట్లో ఒకరకంగా వ్యవహరించినా, ఆ తర్వాత క్రమంలో మరో విధంగా వ్యవహరిస్తోంది.వైసిపి ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు కేంద్రం మద్దతు పలికింది.
అంతేకాకుండా రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రం పరిధిలోనిది అని చెబుతూ.ఆ విషయంలో తాము జోక్యం చేసుకోమంటూ బిజెపి అగ్ర నేతలు ప్రకటించారు.
ఇదేవిధంగా ఏపీ బీజేపీ నేతలు అమరావతి లో రాజధానిని వ్యతిరేకిస్తూ మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ ప్రకటనలు చేసేవారు.అయితే ఇటీవల కాలంలో బిజెపి తన స్టాండ్ మార్చుకుంది .
అమరావతికి జై కొడుతూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది.ముఖ్యంగా న్యాయస్థానం టూ దేవస్థానం యాత్ర సందర్భంగా అమరావతికి బిజెపి జై కొడుతూ ఆ ఉద్యమంలో పాల్గొంది.
అలాగే అమరావతి పాదయాత్రలో కూడా బిజెపి నేతలు పాల్గొన్నారు.అయితే ఇప్పుడు అమరావతి టూ అరసవల్లి పేరుతో అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు చేపడుతున్న యాత్ర కు బిజెపి నేతలు మద్దతు పలుకుతున్నా, ఆ యాత్రలో కీలక పాత్ర పోషించేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు.
రాయలసీమలోని పొద్దుటూరులో రాయలసీమ జోనల్ స్థాయి బిజెపి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు కర్నూలులోనే పెట్టాలని బిజెపి నేతలు డిమాండ్ చేశారు.
అక్కడితో ఆగకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయించే బాధ్యత తామే తీసుకుంటామంటూ ప్రకటనలు చేయడం, అలాగే ఉత్తరాంధ్ర పర్యటనలో విశాఖను ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే ప్రశ్నకు ఏపీ బీజేపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు.ఒకపక్క మూడు రాజధానులకు తాము ఒప్పుకోమని, అమరావతి నే రాజధానిగా కొనసాగించాలంటూ ప్రకటనలు చేస్తూనే ,

మరోవైపు కర్నూలులో హైకోర్టు, విశాఖను అభివృద్ధి చేయాలంటూ రకరకాలుగా బిజెపి నేతలు ప్రకటనలు చేస్తూ ఉండడంతో ఈ విషయంలో వారు ఏం చేయాలో స్పష్టమైన క్లారిటీకి రాలేకపోతున్నారని, అమరావతికి మద్దతు పలికితే మిగతా ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన బిజెపి నేతల్లో ఉండడంతోనే ఈ విధంగా ప్రాంతానికో మాట అన్నట్లుగా మాట్లాడుతూ… పూర్తిగా జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ బిజెపి నేతలు కన్ఫ్యూజ్ అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.







