కాంగ్రెస్ పార్టీలో ముసలం ఏర్పడడం ఆ పార్టీకి కొత్తేమీ కాదు.మొదటి నుంచి కూడా ఆ పార్టీలో కుర్చీలాట ఎన్నో విభేదాలకు తవిస్తూనే ఉంటుంది.
ఇక తెలంగాణలో ఇటీవల అధికారంలోకి వచ్చిన హస్తంపార్టీలో అందరూ ఊహించినట్లుగానే కుర్చీలాట మొదలైంది.రేవంత్ రెడ్డి ( Revanth reddy )ని మొదట ఏకగ్రీవ సిఎంగా ఎన్నుకోవాలని భావించినప్పటికి పలువురు సీనియర్ నేతలు అభ్యంతరాలు తెలపడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది.
కాగా మొదటి నుంచి కూడా టి కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థి విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది.
రేవంత్ రెడ్డి తో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు గట్టిగా పోటీ పడుతున్నారు.ఎన్నికల ముందే సిఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీకి నష్టం చేకూరుతుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ఆ అంశాన్ని హోల్డ్ లో ఉంచుతూ వచ్చింది.కానీ ఇప్పుడు సిఎం ఎవరనేది ఖచ్చింతగా తేల్చాల్సిన పరిస్థితి.
నిన్న జరిగిన సిఎల్పీ సమావేశంలో సిఎం అభ్యర్థిపై క్లారిటీ రాకపోవడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్ అవుతోంది.మరి నేడు దాదాపు సిఎం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం రేవంత్ రెడ్డిని సిఎం అభ్యర్థిగా ప్రకటించడాన్ని సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇంతవరకు సిఎం రేస్ లో ముందున్న రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి కొత్తవారికి అధిష్టానం అవకాశమిస్తుందా ? లేదా సీనియర్ నేతలకు షాక్ ఇస్తూ రేవంత్ రెడ్డినే సిఎం అభ్యర్థిగా నిర్ణయిస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.అయితే రేవంత్ రెడ్డిని సిఎంగా ప్రకటిస్తే అంతర్గత కుమ్ములాటలు పెరిగే అవకాశం లేకపోలేదు.అందుకే మహిళా నేతను సిఎంగా ఎన్నుకునే ఆలోచన కూడా కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే ఆ మద్య రాహుల్ గాంధీ( Rahul Gandhi ) మాట్లాడుతూ రాబోయే పదేళ్ళలో 50 మంది మహిళలే సిఎం కావాలని వ్యాఖ్యానించారు.దాంతో టి కాంగ్రెస్ కు మహిళా సిఎంను ఎంపిక చేసిన ఆశ్చర్యం లేదనేది కొందరి వాదన.
మరి సిఎం పదవిపై నెలకొన్న ఈ కన్ఫ్యూజన్ కు కాంగ్రెస్ హైకమాండ్ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.