తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్( BRS ) ఆ ఓటమి నుంచి తేరుకుని త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha Elections ) సిద్ధం అవుతుంది.తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉండగా , ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైనట్లే.అభ్యర్థుల విషయం లో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ చాలా జాగ్రత్తలే తీసుకున్నారు.
రాజకీయ, సామాజిక సమీకరణాలన్నిటిని లెక్కల్లో తీసుకుని ప్రజల్లో బలమున్న నాయకులకు టిక్కెట్లు కేటాయించారు.అలాగే బిజెపి, కాంగ్రెస్ లకు దీటైన అభ్యర్థులను రంగంలోకి దించారు.
దీని ద్వారా మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్( KCR ) భావిస్తున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ పార్టీ నిజస్వరూపం ఏమిటో ప్రజలకు అర్థమైందని, అందుకే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ,త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తుందని బీఆర్ఎస్ అగ్ర నేతలు పదేపదే ప్రకటనలు చేస్తున్నారు.
ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల జాబితా ప్రకటన పూర్తి కావడంతో , వారు తమ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజలకు దగ్గర అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో విస్తృతంగా ప్రచారం చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక కేసిఆర్ తో పాటు,
ఆ పార్టీ కీలక నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ పర్యటించి ప్రజల దృష్టిని బీఆర్ఎస్ పై పడేవిధంగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం గా చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే మొత్తం 17 లోక్ సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఒకసారి పరిశీలిస్తే…
1.ఖమ్మం – నామా నాగేశ్వరరావు , ( Nama Nageswara Rao ) 2.మహబూబాబాద్ – మాలోత్ కవిత,( Maloth Kavitha ) 3.కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్, 4.పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్ , 5.మహబూబ్ నగర్ – మన్నే శ్రీనివాస్ రెడ్డి, 6.చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, 7.వరంగల్ డాక్టర్ కడియం కావ్య, 8.నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్, 9.జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, 10.ఆదిలాబాద్ ఆత్రం సక్కు, 11.మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మారెడ్డి, 12.మెదక్ పి వెంకట్రామిరెడ్డి, 13.నాగర్ కర్నూల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, 14.సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్, 15 – భువనగిరి క్యామ మల్లేష్, 16.నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి, 17.హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్.