Poonam Kaur Kerala : పూనమ్ కౌర్ వ్యాధి లక్షణాలు ఇంత భయంకరంగా ఉన్నాయ్ ఏంటి.. ఘోరం!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు నటీమణులు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.కాగా ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

 Complete Details Of Poonam Kaur Fibromyalgia , Poonam Kaur, Fibromyalgia, Kerala-TeluguStop.com

దాంతో సమంత అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.సమంత ప్రస్తుతం ఆ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ని తీసుకుంటూ నెమ్మదిగా కోలుకుంటోంది.

ఇది ఇలా ఇండస్ట్రీలో తాజాగా మరొక నటి కూడా ఒక అరుదైన వ్యాధికి గురైనట్టు తెలిపింది.ఆమె మరెవరు కాదు పూనమ్ కౌర్.

ఈమె ప్రస్తుతం ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది.ఈ వ్యాధి ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ రకమే.కాగా ప్రస్తుతం పూనమ్ కౌర్ ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.దీంతో పూనమ్ కౌర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఈ వార్త పై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ ఇండస్ట్రీకి ఏమైంది ఎందుకు ఇలా ఒకరి తర్వాత ఒకరు అరుదైన వ్యాధి బారిన పడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే పూనమ్ బాధపడుతున్న ఆ వ్యాధి లక్షణాల విషయానికొస్తే.

Telugu Fibromyalgia, Kerala, Poonam Kaur-Movie

ఫైబ్రోమయాల్జియా వ్యాధి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుంది.కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.అయితే ఈ వ్యాధి లక్షణాలు చాలా దారుణంగా ఉంటాయి.శరీరం మొత్తం నొప్పులు, జాయింట్స్ ని, కండరాలని దగ్గర ఎప్పుడూ నొప్పిగా ఉంటుంది.మరి ముఖ్యంగా నిద్రపోయి లేచిన తర్వాత శరీరం బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది.అలసట, డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటాయి.

నిద్ర సమస్యలు తలెత్తుతాయి.ఈ వ్యాధి ఎక్కువగా మహిళలకు సోకుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube