ఏపీలోని వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ( Perni Nani, Lella Appi reddy ) కలిశారు.
విశాఖ డ్రగ్స్( Visakhapatnam Drugs ) వ్యవహారంలో వైసీపీపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఈసీకి ఫిర్యాదు చేశారు.

కాగా విశాఖ తీరంలో సుమారు 25 వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.దీనిపై కొందరు రాజకీయ నేతల హస్తం ఉందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.







