ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను( Delhi CM Arvind kejriwal ) ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది.ఈ మేరకు 28 పేజీల రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి ఈడీ అందజేసింది.
ఈ క్రమంలోనే ఆయనను పది రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరుతున్నారు.ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో( Delhi Liquor Policy Scam ) కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఈడీ పేర్కొంది.
లిక్కర్ పాలసీని మద్యం వ్యాపారులకు అనుకూలంగా తయారు చేసి ముడుపులు తీసుకున్నారన్న ఈడీ కేజ్రీవాల్ నివాసంలోనే లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగిందని ఆరోపించింది.ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఈడీ( ED ) చెబుతోంది.
లిక్కర్ వ్యాపారుల నుంచి వచ్చిన ముడుపులను గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని, విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కోసం పని చేశారని చెప్పింది.

సౌత్ గ్రూప్ మధ్యవర్తిగా వ్యవహరించిన విజయ్ నాయర్ వారి నుంచి ముడుపులు తీసుకున్నారంది.కేజ్రీవాల్ ముడుపులు అడిగారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారని ఈడీ తెలిపింది.అదేవిధంగా రెండు సార్లు నగదు లావాదేవీలు జరిగాయని పేర్కొంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC Kavitha ) కేజ్రీవాల్ కలిశారన్న ఈడీ లిక్కర్ పాలసీపై కలిసి పని చేద్దామని కేజ్రీవాల్ ఆమెతో అన్నారని చెప్పింది.ఈ క్రమంలోనే సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన రూ.45 కోట్లను ఆప్ గోవా ప్రచారంలో ఖర్చు చేసినట్లు తెలిపింది.ఈ నేపథ్యంలోనే ఫోన్ రికార్డులు ఉన్నాయని కోర్టు కు తెలిపిన ఈడీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల చాట్స్ ను న్యాయస్థానికి అందించింది.







