టైర్ 1 హీరోలకు దీటుగా టైర్ 2 హీరోల సినిమాలు.. ఎక్కేది ఎవరు ? తొక్కేది ఎవరు ?

ఏ సినిమా ఇండస్ట్రీ లో అయినా మామూలు హీరోలు, హీరోలు, స్టార్ హీరోలు.ఇలా మూడు వర్గాలుగా విడిపోయి ఉంటారు.

 Competition Between Tier 1 And Tier 2 Tollywood Heroes,tollywood Heroes,top Hero-TeluguStop.com

స్టార్ హీరోలను టైర్ 1 హీరోలుగా భావిస్తూ ఉంటారు.వీరి సినిమాకి బడ్జెట్ వంద కోట్లకు పైగానే ఉంటుంది.

పైగా వీరికి రెమ్యూనరేషన్ 50 కోట్లకు పైగానే ఇవ్వాలి.టైర్ వన్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోలు వస్తారు.వీరితో సినిమా తీస్తే ఎంత త్వరగా ఫేమస్ అవుతారో అనే విషయం పక్కన పెడితే హిట్టయితే ఓకే గాని ఫట్ అయితే మాత్రం ఆ నిర్మాత ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే.100 కోట్లు పెడుతున్నారు కాబట్టి 200 కోట్ల మార్కెట్ క్రియేట్ చేయాలని చిత్ర బృందం తహాతహాలాడుతూ ఉంటుంది.

Telugu Crore Club, Balakrishna, Chiranjeevi, Mahesh Babu, Naga Chaitanya, Pawan

స్టార్ హీరోల కన్నా ఒక మెట్టు కిందకు దిగితే టైర్ 2 ఉంటారు.వీరు కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టేంత హిట్టు, లేదంటే ఫట్టు అన్న విధంగా నడుస్తోంది ప్రస్తుతం మార్కెట్.హీరోలలో రామ్ పోతినేని, నితిన్, గోపీచంద్, వరుణ్ తేజ్, నాని, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య వంటి హీరోలు వస్తారు.సినిమా తీయడం దర్శకులకు చాలా ఈజీ.పైగా బడ్జెట్ కూడా 30 నుంచి 50 కోట్లు పెడితే సరిపోతుంది.అది కాస్త హిట్ అయింది అంటే 100 కోట్ల మార్క్ దాటుతుంది.

ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నిర్మాత పెద్దగా నష్టాల పాలవ్వడు.మినిమం టాకి వచ్చినా కూడా చిత్రం గట్టెక్కినట్టే.

అందుకే సినిమాకి సంబంధించి కాస్త టాక్ వచ్చేలా జాగ్రత్త పడితే సరిపోతుంది.

Telugu Crore Club, Balakrishna, Chiranjeevi, Mahesh Babu, Naga Chaitanya, Pawan

ఈ రెండు కేటగిరీలలో కాకుండా కమెడియన్స్ హీరోలుగా మారుతూ లేదా చిన్న సినిమాలతో వస్తున్న చాలా మంది హీరోలు ఉన్నారు.వారిలో కొంత మంది అడపా దడపా సక్సెస్ లు సాధిస్తూనే ఉన్నారు.వీరి సినిమాకు థియేటర్స్ దొరకడం పెద్ద కష్టమైపోయింది అందుకే ఓటిటిని నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు.

పైగా ప్రమోషన్ చేసుకోవడం మరొక పెద్ద టాస్క్ అయిపోయింది.ఇలా ఈ మూడు వర్గాల హీరోల నుంచి ఏ సినిమా వచ్చిన కంటెంట్ బాగుంటేనే విజయం అనే విషయం అందరికీ తెలిసిన వాస్తవమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube