గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ నేత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి( MLA Alla Ramakrishna Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురవేస్తామని తెలిపారు.మంగళగిరిలో లావణ్య గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు.2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి, నాన్ లోకల్ అభ్యర్థి మధ్య పోటీ అని తెలిపారు.మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించిసీఎం జగన్( CM YS Jagan ) కు కానుక ఇస్తామని వెల్లడించారు.
అయితే మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ గా గతంలో గంజి చిరంజీవి పేరును ప్రకటించిన వైసీపీ అధిష్టానం తాజాగా ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె మారుగుడు లావణ్య( Maarugudu Lavanya ) పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే.