బాలకృష్ణ, చిరంజీవి లలో ఉన్న ఏకైక కామన్ పాయింట్ ఏంటో తెలుసా ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్నవారిలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఇద్దరు పేర్లు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి హీరో బాలకృష్ణ.వీరిద్దరూ ఇంత పెద్ద స్టార్ హీరోలుగా ఎదగడానికి కారణం వారి కుటుంబాలే అని చెప్పక తప్పదు.

 Common Point In Balakrishna And Chiranjeevi Wives Details, Chiranjeevi, Balakris-TeluguStop.com

ఎందుకంటే హీరోలుగా 24 గంటలు బయట పనిచేస్తుంటే కుటుంబాన్ని పట్టించుకుని, పిల్లల్ని పెంచి ,పెద్ద చేసిన బాధ్యత వారి భార్యలపైనే ఉంటుంది.

ఇక చిరంజీవి, బాలకృష్ణ ఈ విషయంలో చాలా లక్కీ హీరోలు అని చెప్పాలి.

పైగా చిరంజీవి భార్య సురేఖ, బాలకృష్ణ భార్య వసుంధరలో ఒక కామన్ పాయింట్ ఉంది.అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.చిరంజీవి భార్య సురేఖ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగింది.అలాగే ఉమ్మడి కుటుంబానికే పెద్ద కోడలుగా వచ్చింది.

ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా, అభిమానులు వచ్చిన వారికి ఎలాంటి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకుంటుందట ఎవరినైనా కూడా తినకుండా ఆ కాలి కడుపుతో పంపించదట.

Telugu Balakrishna, Chiranjeevi, Nandamuri, Surekha, Vasundhara-Movie

అన్ని విషయాలు అడిగి తెలుసుకుని, వారి బాగోగులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుందట.పని వాళ్లను కూడా తన సొంత మనుషుల్లా చూసుకోవడంలో సురేఖ తర్వాతే ఎవరైనా అని అంటూ ఉంటారు ఇండస్ట్రీలోని కొంతమంది.ఇక చిరంజీవి భార్య సురేఖకు ఏ మాత్రం తీసిపోదు బాలకృష్ణ భార్య వసుంధర.

నందమూరి కుటుంబం పరువును నిలబెట్టేలా ప్రతి ఒక్కరికి మర్యాద చేస్తుందట.

Telugu Balakrishna, Chiranjeevi, Nandamuri, Surekha, Vasundhara-Movie

ఇంటికి వచ్చే వారికి సకల సౌకర్యాలను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తుంది.బాలకృష్ణ ఎంత బిజీగా ఉన్నా ఆయన లేని లోటు తెలియకుండా ఇంటిని చక్కదిద్దడంలో వసుంధర ఎప్పుడు ముందుంటుందట.ఇటు బాలకృష్ణ, చిరంజీవి కూడా వారి భార్యల గురించి ఎప్పుడూ మీడియాలో ఎంతో బాగా చెప్తూ ఉంటారు.

వారి భార్యలపై ప్రేమను చూపించడానికి ఏమాత్రం వెనుకాడరు ఈ ఇద్దరు హీరోలు.అందుకే తాము స్టార్ హీరోలుగా ఎదగడానికి ముఖ్య పాత్ర తమ భార్యలకు ఇస్తున్నారు చిరంజీవి మరియు బాలకృష్ణ.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube