పవన్ కళ్యాణ్ కి సామాన్యుడి సూటి ప్రశ్నలు

రాజకీయాల్లో సినిమా వాతావరణం సృష్టించి.సినిమా ట్రిక్స్ ప్లే చేస్తూ.

 Common Man Asked Shocking Questions To Pawan Kalyan-TeluguStop.com

ఎలాగో అలా 2014 లో చంద్రబాబు కి మద్దతు చేస్తూ బాబు ని అధికారంలో కూర్చోబెట్టాడు పవన్.పవన్ మీద ఉన్న క్రేజ్ తో కొన్ని ఓట్లు చీలిపోయి అవి బాబు ఖాతాలోకి మల్లినాయి.

తరువాత ప్రజలకి అర్ధం అయ్యింది.పవన్ సినిమా చూపించాడు అని.ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పగటి వేషగాడు మళ్ళీ వచ్చాడు.కొత్త కొత్త డైలాగులు చెప్తూ జనాలని ఒర్రుతలు ఊగిస్తూ వస్తున్నాడు.

మళ్ళీ బాబు కి పట్టం కట్టడానికి అంటూ వైసీపి కర్నూల్ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.వైసీపి వాళ్ళు ఫైర్ అవ్వడం పెద్ద విషయం కాదు అది కామన్ గా జరిగేదే కానీ ఇప్పుడు ఇదే విషయాల మీద ఫైర్ అయ్యేది మాత్రం ఒక కామాన్ మ్యాన్.

ఆ కామన్ మ్యాన్ వేసే ప్రశ్నలకి పవన్ దగ్గర సమాధానాలు కూడా ఉండవట సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ప్రశ్నలు హల్చల్ చేస్తున్నాయి.నిజమగా పవన్ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలడా అని అనిపిస్తోంది.

అవేంటో మీరు ఓ లుక్కేయండి

కామన్ మ్యాన్ పవన్ పై సంధిస్తున్న ప్రశ్నలు

స్వచ్ఛమైన రాజకీయాలు కావాలి…మార్పు తీసుకొచ్చేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటున్న మీరు టిడిపీ 22 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు.మంత్రి పదవులు కట్టబెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా.? దానిపై మీరెందుకు ప్రశ్నించడం లేదు.?

పోలవరం ప్రాజెక్టులో ఏఏ మంత్రులు, ఎంపీలు…వారి బినామీలు సబ్ కాంట్రాక్టులు చేస్తున్న విషయం…అంచనాలను పెంచేసుకుని కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం మీకు కనిపించలేదా.? అసలు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత మీరెందుకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్లు కోసం కాదా అని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు.?

రాజ్యాంగం మనకు అందించిన హక్కుల మేరకు ఎవరైనా ఏ పదవైనా ఆయా నిబంధనల మేరకు చేపట్టవచ్చు.అటువంటప్పుడు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలా…? అని ప్రశ్నించేటప్పుడు రాజ్యాంగ హక్కులు మీకు గుర్తుకురాలేదా.? మరి చంద్రబాబు గారి కుమారుడు దొడ్డిదారిన మంత్రి అయినప్పుడు మీ ప్రశ్న ఎక్కడికి వెళ్లింది.?

అది కూడా వారసత్వమేగా.? రాహుల్ గాంధి ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యాడు…నెహ్రూ కూతురు ప్రధాని అయ్యింది…ఆమె కుమారుడు ప్రధాని అయ్యాడు.మరి కాంగ్రెస్ లో ఉంటున్న మీ అన్నని ఈ విషయం ప్రశ్నించలేదేం.?

ప్రత్యేక హోదాను మీరు సమర్ధిస్తున్నందుకు ధన్యవాదాలు.మరి అదే చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినీనా అన్నప్పుడు మీరు ప్రజలని అభిమానులని ఆకట్టుకోవడానికి షర్టులు చిరిగిపోఎలా వేసే మీ గావుకేక ఎక్కడికి వెళ్లింది.? మీ ప్రతాపం స్టేజీలకే పరిమితమా.?

జగన్ అవినీతి పరుడంటూ మీరు విమర్శించారు.మీరు నిరూపించగలరా.? మరి విచారణలో ఉన్న ఓ అంశాన్ని మీరు నిరూపితం కాకుండా ఎలా ఆరోపిస్తున్నారు.అదేమంటూ మీరు రాజ్యాంగం గురించి మాట్లాడతారు…? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా.? రాజ్యాంగాన్ని నువ్వు గౌరవిస్తున్నావు అని చెప్పడం ఇదే నా

నారాయణ కళాశాలల్లో విద్యార్థుల మృత్యుఘంటికలు మీ కంట్లో పడలేదా.? తెలిసీ కిమ్మనడం లేదా.?
అధికారులను కిందపడేసి ఆడ, మగా తేడా లేకుండా కాళ్లతో అధికార పార్టీ నేతలు తన్నేస్తుంటే మీ ఎందుకు కనిపించలేదు.?.జనసేన కంటికి టిడిపి చేస్తున్న తప్పులు కనబడవా?

-నిరుద్యోగల కోసం నేను ఎందాకైనా పోరాడతానంటూ చెప్పిన మీరు ఇప్పటికీ అతిగతీ లేని గ్రూప్స్ నోటిఫికేషన్లు, క్యాలెండర్ గురించి మీరెందుకు మాట్లాడటం లేదు.?

మీరు దేన్నైనా ప్రశ్నిస్తానంటున్నపుడు నంది అవార్డులు ఒకే సామాజిక వర్గానికి వెళ్లాయంటూ వచ్చిన ఆరోపణలపై మీరెందుకు నోరు మెదపలేదు.? శాతకర్ణికి పన్ను రాయితీ ఇచ్చి…రుద్రమదేవికి ఎందుకు ఇవ్వలేదు అన్న గుణశేఖర్ ప్రశ్న మీకు వినిపించలేదా.? చిన్న సినిమాల మీద జరుగుతున్న దోపిడీ నీకు కనబడలేదా.? నువ్వు సినిమాల నుంచీ వచ్చిన వాడివేగా మరి చిన్న సినిమాలపై ఇప్పటికీ నోరు మెదపలేదు ఎందుకు ?

యువకులనే టార్గెట్ చేస్తూ పిచ్చి అరుపులు అరుస్తూ చేస్తున్న నీ ప్రసంగాలు.అన్నీ అక్కడకి వచ్చే ఓటు హక్కు కూడా లేని వారికి అర్థం కాదు.నిన్ను గుండెల నుండా నింపుకున్న ఒటున్న కుర్రాళ్ళకి అర్థం కాదు అయితే అక్కడకి వచ్చే చాలా మంది నిరుద్యోగులకి మీకు నిరుద్యోగ బ్రుతి వస్తోందా అని అడిగే దమ్ము నీకు ఉందా ? అదే వేదికపై అందరినీ విమర్శించే దమ్ము నీకు ఉన్నప్పుడు.బాబుగారూ మీరిస్తానన్న నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలు ఎక్కడా.అని మీరెందుకు ప్రశ్నించలేదు.? అంటే బాబు ని ప్రశ్నించే దమ్ము మీకు లేదా ?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఇటువంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…దమ్ము గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ నీకు ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే దమ్ము ఉందా అంటూ చాలా ఘాటుగానే నిలదీస్తున్నారు.నీ కోసమే మునుపటి ఎన్నికల్లో ఓట్లు వేశాము.

బాబు మాకు అన్యాయం చేశాడు.నిలదీసే దమ్ము ఉందా అంటూ కామన్ మ్యాన్ వేసే ప్రశ్నలకి మరి పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube