నా కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడంటున్న కమెడియన్ సుధాకర్..!

తెలుగు సినీ నటుడు ఆ తర్వాత కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్న సుధాకర్ గురించి అందరికీ తెలిసిందే.

ఆయన ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండగా ఒకప్పటి సినిమాలలో తన కామెడీతో తెగ నవ్వించేవారు.

ఇదిలా ఉంటే ఆయన ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ రావడం తో 40 రోజులు కోమాలో ఈ మధ్యే కోలుకుంటున్నారు.ఇక ఆ సమయంలో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు రాగా వాటి గురించి స్పందిస్తూ తన కొడుకు సినీ ప్రవేశం చేయనున్న విషయాన్ని తెలిపాడు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అంటూ సంక్రాంతి సినిమా తర్వాత అనారోగ్యానికి గురికావడంతో మళ్లీ సినిమాలు చేయలేదని తెలిపాడు.తను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో జగపతి బాబు, చిరంజీవి, కోటి ఇలా చాలా మంది వచ్చి వెళ్లారని తెలిపాడు.

ఇక ఆయన బయటకు వచ్చిన తర్వాత తన కొడుకు చదువు కాలేజీ సీట్ కోసం చిరంజీవిని కలిసానంటూ ఆ తర్వాత మళ్ళీ కలవలేదని తెలిపాడు.

Advertisement

ఇక తనతో పాటు చిరంజీవి, హరి ప్రసాద్ ఒకే రూమ్లో ఉండేవారట.కానీ ఇప్పుడు ఎవరు టచ్ లో లేరని ఆర్టిస్ట్ శివ కృష్ణ ఒక్కడే టచ్ లో ఉన్నాడని తెలిపారు.ఒకప్పుడు తాను సినిమాల్లో బాగా సంపాదించుకున్నానంటు, ఒకరిచ్చే పొజిషన్ లో లేనంటూ, అప్పు తీసుకునే స్థితిలో కూడా లేదంటూ తెలిపాడు.

ఇక తన రూమ్ మెట్స్ లో చిరంజీవి బాగా సెటిల్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.ఇక ఆయన నటించిన సినిమాల గురించి కొన్ని విషయాలు తెలిపాడు.ఇదిలా ఉంటే తన కొడుకు బెనిడిక్ మైకేల్ ( బెన్నీ) గురించి పరిచయం చేస్తూ అతను సినిమాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నాడని, నటన తన బ్లడ్ లోనే ఉందని తెలిపారు.

ఇక ఆయన సినిమాల్లోకి వస్తాడని సుధాకర్ అనుకోలేదట.ఇక తను దేవుడిచ్చిన బిడ్డ అంటూ అతడు పుట్టినప్పుడు మంచి స్వింగ్ లో ఉన్నానని తెలిపాడు.

ఇక బెన్నీ మాట్లాడుతూ.నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నానని తెలిపాడు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ఒక ప్రాజెక్టు సిద్ధమైందని, వర్క్ షాప్ నడుస్తుందని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిపాడు.ఇక కొత్త దర్శకుడు నరేష్ తనను అఫ్రోజ్ అయ్యారని హీరోగా చేయాలని ఏం లేదు కానీ నాన్నల ఏ పాత్ర వచ్చినా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక చిరంజీవి ని తన స్టడీ పర్పస్ గా కలిశానంటూ తెలిపాడు.

తాజా వార్తలు