ఘనంగా కమెడియన్ అలీ పెద్ద కుమార్తె నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

వెండితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా సందడి చేసి అనంతరం కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన తన ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

 Comedian Alis Eldest Daughters Engagement Photos Going Viral , Comedian Ali ,eld-TeluguStop.com

అలీ ఇప్పటికీ కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో అవకాశం వస్తే నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా ఒక వైపు సినిమాలు మరోవైపు ఆలీతో సరదాగా అనే కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు.

ఇక అలీ సినీ కెరియర్ విషయాన్ని పక్కన పెట్టి ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన భార్య జుబేదా గురించి అందరికీ సుపరిచితమే ఈమె కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఎన్నో రకాల వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ అందరికీ సుపరిచితమయ్యారు.ఇక ఈయన పిల్లల విషయానికి వస్తే ఆలీకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి.

అలీ పెద్దమ్మాయి ఫాతిమా తాజాగా డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా అలీ తన పెద్ద కుమార్తె ఫాతిమాకు ఘనంగా నిశ్చితార్థం చేసినట్లు తెలుస్తోంది.ఆగస్టు 25వ తేదీ హైదరాబాద్ లోని కోహినూరులో తన కూతురి నిశ్చితార్ధాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

అలీ తనకు కాబోయే అల్లుడు షేక్ షహయాజ్ అని వెల్లడించారు.అయితే అతను ఏం చేస్తారు ఏంటి అనే విషయం మాత్రం తెలియదు కానీ ప్రస్తుతం తన కూతురి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అదేవిధంగా తన కూతురి నిశ్చితార్థ వీడియోని అలీ భార్య జుబేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.ఇక ఇది చూసిన ఎంతోమంది అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube