విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమా ఊహించని విధంగా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికల పడిపోయింది.చివరికి విజయ్ దేవరకొండ అభిమానుల సైతం ఈ సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా IMDB లో అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే లైగర్ సినిమాకి IMDB లో 10 కి గాను కేవలం 1.7రేటింగ్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ఎలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొందో తెలుస్తుంది.ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా , అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమా కన్నా తక్కువ రేటింగ్ సొంతం చేసుకోవడం గమనార్హం.అమీర్ ఖాన్ సినిమాకి ఐదు రేటింగ్ సొంతం చేసుకోగా అక్షయ్ కుమార్ రక్షాబంధన్ 4.6 రేటింగ్ సొంతం చేసుకుంది.ఈ రెండు సినిమాలతో పోలిస్తే లైగర్ దారుణమైన రేటింగ్స్ సొంతం చేస్తుందని తెలుస్తుంది.

లైగర్ సినిమా కేవలం IMDB లో మాత్రమే కాకుండా బుక్ మై షో లో కూడా అత్యంత తక్కువ రేటింగ్ సొంతం చేసుకుంది.బుక్ మై షోలో లైగర్ 60 శాతం రేటింగ్ సొంతం చేసుకోగా, కళ్యాణ్ రామ్ బింబిసారా దుల్కర్ సల్మాన్ సీతారామం, నిఖిల్ కార్తికేయ 2 సినిమాలు ఏకంగా 90 శాతం రేటింగ్ సొంతం చేసుకున్నాయి.ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో విజయ్ అభిమానులు ఎంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







